పుష్ప పార్ట్ 1 పుష్ప ద రైజ్ రిలీజ్ అయ్యి ఇంకో నెలన్నరకి ఏడాది పూర్తయ్యిపోతుంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కూడా ఈ ఏడాది రిలీజ్ అవ్వుద్ది అన్నటుగా మేకర్స్ ఎప్పుడో చెప్పినా.. అసలు ఇంతవరకు పుష్ప పార్ట్ 2 పట్టాలెక్కలేదు. దానితో అల్లు అభిమానులలో ఎక్కడలేని ఆందోళన మొదలయ్యింది. గత నెలలోనే పూజా కార్యక్రమాలతో పుష్ప పార్ట్ 2 అఫీషియల్ గా మొదలు పెట్టినప్పటికీ.. రెగ్యులర్ షూటింగ్ కి చాలా టైం తీసుకున్నారు. అల్లు జయంతి రోజున అల్లు స్టూడియోస్ లో పుష్ప షూటింగ్ అంటూ ప్రచారం జరిగినా అది అవ్వలేదు.
అయితే తాజాగా పుష్ప పార్ట్ 2 అఫీషియల్ గా ఫోటో షూట్ చేస్తున్న విషయాన్ని మేకర్స్ ఓ పిక్ తో ప్రకటించారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ లీడ్ పెయిర్‌పై ఫోటో షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిక్ లో సుకుమార్ కూడా ఉన్నారు. మరి అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, రష్మిక శ్రీవల్లి గా ఈ లుక్ టెస్ట్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రీ లుక్ షూట్ పూర్తయిందని, త్వరలో రష్మిక మందన్నపై ప్రీ లుక్ షూట్ చేస్తారని ఇన్‌సైడ్ టాక్. త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఫహద్ ఫాసిల్ కూడా త్వరలోనే హైదరాబాద్ కి రాబోతున్నట్టుగా సమాచారం.