బాహుబలి తో విశ్వవ్యాప్తంగా ఘాన కీర్టీని సాధించిన ప్రభాస్, తన తదుపరి చిత్రాలనని దేశమంతా విడుదలచేయాలనే ప్రణాళికలను రచించి, అందుకు తగ్గట్టుగానే కథలను ఎన్నుకోసాగాడు. సాహో, రాధే శ్యామ్ విషయంలో కొంత విమర్శలను ఎదుర్కొన్నా అన్నింటినీ అధిగమించి సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్,ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
అన్ని చిత్రాలకంటే, ప్రజలంతా అతడి చిత్రం సలార్ రాకకై ఆత్రురతో ఎదురు చూస్తున్నారు. కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ కి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్, జగపతి బాబు, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ మొదటి లుక్ విడుదలతో అందరిలో కాక పుట్టించాడు. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 సందర్భంగా మరిన్ని ఆశ్చర్యకరమైన ప్రకటలనలతో ఉత్తేజపరచడానికి ఉద్యుక్తుడవుతున్నాడు.
ఇలా ఉండగా, సలార్ గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకి వస్తోంది. ప్రభాస్ కాళీ మాత భక్తునిగా, దుష్టశక్తులను పతాక సన్నివేశాలలో ఊచకోత కోస్తాడని, ఆ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉంటాయని వినికిడి. ప్రశాంత్ నీల్ ఇదివరకే కే.జి.ఎఫ్ లో కథానాయకుడిని దైవ భక్తునిగా చూపించి అందరిని ఉర్రూతలూగించాడు. ఇప్పుడు అదే విధంగా ప్రభాస్ ని చూపించి, సంచలనం సృష్టిస్తాడని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక భూమిక పోషిస్తోంది. సినీ ప్రేమికులలో, ప్రభాస్ కాళీ భక్తునిగా కనిపిస్తాడని వినగానే, ఇంతకు ముందర అఖండలో బాలకృష్ణ అఘోర పాత్రలో శివ భక్తునిగా ఎలా శివతాండవం చేసాడో, ప్రభాస్ అలా చేస్తాడని ఊహించుకుంటున్నారు.