బాలీవుడ్ శ్రీదేవి కూతురి గా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అక్కడి సినిమాల్లో తనని తానూ ప్రూవ్ చేసుకుని శ్రీదేవి డాటర్ టాగ్ నుండి బయటపడేందుకు నానా కష్టాలు పడుతుంది. కెరీర్ లో ఆమెకి బ్రేక్ ఇచ్చే సినిమా తగలకపోవడంతో జాన్వీ కపూర్ ప్రస్తుతం గ్లామర్ మీదే ఫోకస్ పెడుతుంది. చిన్న విషయానికి, పెద్ద విషయానికి గ్లామర్ షో తో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బికినీ షోస్ అలా ఉంచి క్లివేజ్ షో పై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. జిమ్ వేర్ లో టైట్ ఫిట్ తో ఎక్స్ పోజింగ్ చేసే జాన్వీ కపూర్ ఈ డోస్ చాలదనుకుందో ఏమో..
ఆమె రీసెంట్ చిత్రం మిలి ప్రమోషన్స్ లో అందాలు ఆరబొయ్యడమే పనిగా పెట్టుకుంది. డిజైనర్ వేర్ లేదు, సారీస్ లేవు, మోడరన్ వేర్, కుర్తిస్ ఇలా ఏ డ్రెస్ వేసినా ఆమె ఎద అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకుంటుంది. గ్లామర్ షోలో హద్దులు దాటేసినా అమ్మడికి ఒక్క స్టార్ ఛాన్స్ కూడా తగలేకపోవడం గమనార్హం. ఇక జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫిలిం తో సౌత్ కి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.