ఎప్పుడూ క్లాస్ గా, డీసెంట్ గా ఉండే నాని దసరా సినిమా కోసం రఫ్ గా మాస్ అవతారమెత్తాడు. కేజిఎఫ్, సలార్, పుష్ప చిత్రాల్లో హీరోల మాదిరి నాని కూడా ఊర మాస్ గా లుంగీ కట్టి బొగ్గులో పని చేసే కుర్రాడిగా కనిపించాడు. మార్చ్ లో విడుదల కాబోతున్న దసరా సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అంటూ దసరా నవరాత్రుల్లో మేకర్స్ హడావిడి చెయ్యగా.. ఫస్ట్ సింగిల్ లో నాని అవతారం చూసి భయపడ్డారు. అసలు ఆ సాంగ్ లో నాని ని వెతికి పట్టుకోవడానికి చాలా టైమ్ పట్టేసింది. అంతలాంటి మాస్ లుక్ లోకి నాని మారిపోయాడు. ఇక ఈ సినిమాలో నాని కి కాజోడిగా కీర్తి సురేష్ మరోసారి నటిస్తుంది. ఈరోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ ని వదిలి ఆమెకి విషెస్ తెలియజేసారు.
అయితే దసరాలో నాని లుక్ భీకరంగా ఉంది అంటే.. ఇప్పుడు కీర్తి సురేష్ దసరా ఫస్ట్ లుక్ మరింత భయానకంగా అంటే.. డీ గ్లామర్ గా కనిపించి షాకిచ్చింది. ఎల్లో కలర్ కాటన్ చీరలో సాదాసీదాగా, పెళ్లి కూతురు గెటప్ లో డాన్స్ చేస్తూ కీర్తి సురేష్ దసరా లుక్ లో కనిపిస్తుంది. తమిళ్ సినిమాల్లో కీర్తి సురేష్ లుక్ చాలా సినిమాల్లో ఇలానే ఉంటుంది. అది తమిళ తంబీలకు నచ్చుతుంది. రంగస్థలంలో రామలక్ష్మిలా సమంత, పుష్ప లో శ్రీవల్లిగా రష్మీక డీ గ్లామర్ కేరెక్టర్స్ కి మంచి పేరు వచ్చింది. మరి దసరా కోసం డీ గ్లామర్ అవతారమెత్తిన కీర్తి సురేష్ కి వెన్నెల గా ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.