టాలీవుడ్ నుండి హిందీ ఇలా మిగతా భాషల్లో దసరా ఫెస్టివల్ అక్టోబర్ 5 న ఆడియన్స్ ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ తెలుగులో హిట్ గా నిలవగా మిగిలిన భాషల్లో పెరఫార్మెన్స్ విషయంలో అంతమాత్రంగానే కనిపించింది. తమిళంలో ఓ వారం తర్వాత అంటే అక్టోబర్ 14 న ఎలాంటి ప్రమోషన్స్, ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ ని అక్కడి ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సినిమా అయినా.. అక్కడి ఆడియన్స్ గాడ్ ఫాదర్ ని తిరస్కరించారు.
తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ అంతకుముందే మలయాళంలో లూసిఫర్ రూపంలో వచ్చెయ్యడం, దానిని వీక్షించేసిన తమిళ తంబీలు ఈ గాడ్ ఫాదర్ ని పట్టించుకోలేదు. తమిళంలో గాడ్ ఫాదర్ డిసాస్టర్ ఎటెంప్ట్ గా మిగిలిపోయింది. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్స్ పోగేసిన గాడ్ ఫాదర్ హిందీ లో సల్మాన్ ఖాన్ ఉన్నప్పటికీ.. అంతమాత్రమైన కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇక తమిళంలో వచ్చిన టాక్ తో అక్కడి కలెక్షన్స్ కౌంట్ చెయ్యడం కూడా కరెక్ట్ కాదేమో.