Advertisementt

అందుకే బిగ్ బాస్ కి వెళ్ళలేదు

Mon 17th Oct 2022 10:45 AM
jabardasth,getup srinu,bigg boss  అందుకే బిగ్ బాస్ కి వెళ్ళలేదు
Getup Srinu about Bigg Boss అందుకే బిగ్ బాస్ కి వెళ్ళలేదు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చినా బిగ్ బాస్ కి వెళ్లని వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరున్న సెలబ్రిటీస్ ని బిగ్ బాస్ లోకి తెచ్చేందుకు భారీ పారితోషకం ఎర వేసినా దానిని తిరస్కరించినవారూ ఉన్నారు. రీసెంట్ గా గెటప్ శ్రీను బిగ్ బాస్ నుండి మీకు ఆఫర్ వచ్చినా ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళలేదు, బిగ్ బాస్ కి వెళ్లిన జబర్దస్త్ చంటి, ఫైమాకి సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే.. ఇప్పుడేగా వాళ్ళు నిలదొక్కుకుంటున్నారు.. తర్వాత వారాల్లో సపోర్ట్ ఇద్దామనుకుంటే చంటి అన్న బయటికి వచ్చేసాడు. ఇక నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా వెళ్లకపోవడానికి రీజన్.. నేను జబర్దస్త్, సినిమాల షూటింగ్స్ తో బిజీగానే ఉంటున్నాను. ఇలాంటి టైం లో అవి వదులుకుని ఓ షో కోసం టైం స్పెండ్ చెయ్యడం ఎందుకులే అని వెళ్ళలేదు.

ఇక్కడ ఖాళీగా ఉంటే బిగ్ బాస్ కి వెళ్ళేవాడినేమో.. అయినా బిగ్ బాస్ అంటే అన్ని ఎమోషన్స్, పర్సనల్ విషయాలు బయటికి వచ్చేస్తాయి. పర్సనల్ గా ఎలా ఉంటామో తెలిసిపోతే.. మనం స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపించం. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళలేదు, మన విషయాలేమి తెలియకుండా ఉంటేనే మనం బయట బాగా యాక్ట్ చెయ్యగలుగుతాము అంటూ గెటప్ శ్రీను బిగ్ బాస్ కి ఆఫర్ వచ్చినా వెళ్లకపోవడానికి కారణాలను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Getup Srinu about Bigg Boss:

Jabardasth Getup Srinu on Bigg Boss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ