సొట్ట బుగ్గల చిన్నది హన్సిక పెళ్ళికి రెడీ అవుతుంది అనే వార్తలు ఈ మధ్యన తరుచూ చూస్తున్నాం, వింటున్నాం. కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా.. చేతిలో అవకాశాలతో బిజీగానే ఉంటున్న హన్సిక గతంలో శింబు తో ప్రేమాయణం నడిపింది. కోలీవుడ్ హీరో శింబు తో పీకల్లోతు ప్రేమలో ఉన్న హన్సిక శింబు తో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది అనే ప్రచారం జరిగింది. తర్వాత ఆ ప్రేమ బ్రేకప్ అవ్వగా.. ఇప్పుడు హన్సిక బుద్దిగా సినిమాలు చేసుకుంటుంది. పని విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న హన్సిక వ్యక్తిగతంగానూ సెటిల్ అవ్వాలని అనుకుంటుందట. దానిలో భాగమే ఈ పెళ్లి అంటున్నారు. హన్సిక తన పెళ్లిని డిసెంబర్ లో చేసుకోవాలి అని అనుకుంటుందట.
హన్సిక పెళ్లి కోసం సీక్రెట్ గా జైపూర్ ప్యాలెస్ లో ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలో వచ్చాయి. హన్సిక చేసుకోబోయే వరుడు ఎవరో తెలియకపోయినా.. ఆమె పెళ్లి చేసుకునే వేదికపై ఇలాంటి వార్తలు రావడం నిజంగా షాకింగే. జైపూర్ లో 450 ఏళ్ళ చరిత్ర గల ముండోట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ ని హన్సిక సన్నిహితులు ఆమె పెళ్లి కోసం బుక్ చేసినట్లుగా చెబుతున్నారు. అంగరంగ వైభవంగా హన్సిక ఆ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి హన్సిక పెళ్లి విషయం, ఆమె చేసుకోబోయే వరుడు విషయం బయటపెడుతుందో.. లేదంటే పెళ్లి సీక్రెట్ గా జరిగే వరకు చెప్పాదో.. చూద్దాం.