జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేసిన సమయంనుండి ఎన్నికలలో చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి తన ప్రత్యర్థులను అనైతికంగా అణగద్రొక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే, ఆయన అనుంగు మంత్రులు ప్రత్యర్థుల పై బూతు పురాణం ప్రారంభించారు. ప్రత్యేకంగా జన సేనాని పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలసాగారు. పవన్ కళ్యాణ్ చలన చిత్రాలను, రాజకీయాలను సమర్థంగా నిర్వహిస్తూ సమతుల్యతతో ముందుకు సాగుతూ జగన్ ప్రభుత్వం అవినీతి,అనైతిక,అరాచక విధానాలను ఎండగడుతుంటే, జగన్ మరియు అతడి అనుచరులు మాత్రం పవన్ ని వ్యక్తిగతంగా విమర్శించసాగారు.
ఎన్ని విధాల ప్రయత్నించినా, పవన్ కళ్యాణ్ సంమయనం కోల్పోకుండా జవాబులిస్తోంటే, జగన్ అవి చేతకాని వాటికింద జమకట్టి రోజురోజుకి రెచ్చిపోసాగారు. కానీ, సింహం జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో, ప్రశాంతత తర్వాత తుఫాను వస్తే ఎలా ఉంటుందో, పవన్ ఒక చూపు చూడగానే, వెన్నులో వణుకు పుట్టింది. అందుకు నిదర్శనమే, పవన్ కళ్యాణ్ జన గర్జన. విశాఖపట్నంలో పవన్ అడుగు పెట్టగానే, జనాలలో, జన సైనికులలో అంతులేని ఉత్సాహం, ఉద్వేగం పుట్టి ప్రభుత్వంలోని మంత్రులు రోజా మొదలైన వారికి చుక్కలు చూపించారు.
మంత్రులు పలాయనం చిత్తగించి, తమ చెప్పుచేతులలో ఉన్న పోలీసు బలగాన్ని, జనసైనికులపై మరియు పవన్ కళ్యాణ్ పైకి ఉసిగొల్పారు. నోటీసులు పేరుతొ పవన్ కళ్యాణ్ ని ఉక్కు నగరం నుండి పంపించివేయవచ్చు గాని, పవన్ కళ్యాణ్ ఉక్కు సంకల్పం, ఆంద్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని, జగన్ఎంతో కాలం అణగత్రొక్కలేరు. పవన్ కళ్యాణ్ ప్రళయంలో జగన్ జలసమాధి కావడం తధ్యం.