ఒకప్పుడు యంగ్ హీరోలతో ఆడిపాడిన త్రిష ప్రస్తుతం సీనియర్ హీరోలకి అడ్డాగా మారింది. తమిళంలో రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చి అందరిని బుట్టలో పడేసిన త్రిష వయసు పెరుగుతున్నా.. అందం తరిగిపోతుందా.. కాదు మరింతగా మెరిసిపోతూ అందం పెరిగిపోతుంది. అయితే త్రిష కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకి దూరంగానే ఉంటుంది. చిరు ఆచార్యకి సైన్ చేసి సెట్స్ లోకొచ్చాక ఆమె ఆచార్య నుండి తప్పకుంది. ఆచార్య డిసాస్టర్, అలాగే హీరోయిన్ కి అస్సలు ఇంపార్టెన్స్ లేని కేరెక్టర్ నుండి త్రిష తప్పుకుని మంచి పనే చేసింది అన్నారు. ఇప్పుడు మరోసారి సీనియర్ హీరో సినిమాలో త్రిష కనిపించే ఛాన్స్ ఉంది అంటున్నారు.
అది బాలకృష్ణ సినిమాలో బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో NBK108 (వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కనున్న సినిమాలో బాలయ్య కి హీరోయిన్ గా త్రిష అయితే బావుంటుంది అని ఆమెని సంప్రదించే పనిలో ఉన్నారట. దాని కోసం త్రిషకి కోటి ఆఫర్ కూడా చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. గతంలో బాలయ్య తో త్రిష లయన్ అనే డిసాస్టర్ మూవీలో నటించింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించే ఆమె బాలయ్య కూతురు పాత్ర చేస్తున్న శ్రీలీలకి తల్లిగా కనిపించాలి. మరి దీనికి త్రిష ఒప్పుకుందా.. అని కొందరంటుంటే.. పాప చిన్నప్పుడే బాలయ్య భార్యని కోల్పోతారు. సో అలా శ్రీలీల కి త్రిష మదర్ అవుతుంది.. అందుకే త్రిష ఒప్పుకుంటుంది అంటున్నారు.