ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఆసాంతం ప్రజలంతా జగనే మాయ అని గానం చేస్తున్నారు. ఆంధ్రులు ఆరంభశూరులని ఊరకనే అనలేదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో, పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకి పూనుకోగా, ఇతర నేతలంతా తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనకి మద్దతు తెలపకుండా తమ పబ్బం గడుపుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తిన్నా, తమ తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. అందుకనే, కొందరు ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం అని,సమైక్యాంధ్ర అని, ఉత్తర ఆంద్ర అని, ప్రత్యేక రాయలసీమ అని ఉద్యమాలు సాగించి అందరిలోనూ చులకన అయ్యారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, చంద్ర బాబుని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని, ఆయనకి సరైన సమయం ఇవ్వకుండా, ఐదేళ్ల లోనే అద్భుతాలు ఆశించారు. తెలంగాణ ప్రజలకున్న చిత్తశుద్ధి కూడా వారికి లేదు. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చెందినా, కేసీఆర్ కు రెండవసారి అవకాశం ఇచ్చారు, ఐదేళ్ల లో అద్భుతాలు జరగవని వారు ముందరే అర్ధం చేసుకున్నారు.
ఆంధ్రులు,జగనన్న చూపించిన అరచేతిలో వైకుంఠం ని నమ్మి, ' కావలి జగన్, రావాలి జగన్. మన జగన్' అని చిందులేసి నెత్తిన పెట్టుకున్నారు. కానీ వారు గ్రహించేలోపాలే, జగనన్న అభయహస్తం, భస్మాసుర హస్తంగా మారి అందరిని హరించేస్తుంటే అల్లాడుతున్నారు. ఐదేళ్లు, ఐదు వందల యుగాలుగా అనిపిస్తుండటంతో, ఆదృతతో, ఆర్తనాదంతో 'జగనే మాయ' అని గానం చేస్తూ, ఏదైనా అద్భుతం జరిగి తమ జీవితాలలో వెలుగులు చూడాలని పరితపిస్తున్నారు. మరి వారి కోరిక ఎవరు నెరవేరుస్తారో, తీరే ఘడియలు ఎప్పుడు వస్తాయో?