Advertisement
TDP Ads

పవన్ కళ్యాణ్ వైజాగ్ షో బ్లాక్ బస్టర్

Sun 16th Oct 2022 05:01 PM
pawan kalyan,vizag,janasena,ycp  పవన్ కళ్యాణ్ వైజాగ్ షో బ్లాక్ బస్టర్
Pawan Kalyan storm shivers Jagan పవన్ కళ్యాణ్ వైజాగ్ షో బ్లాక్ బస్టర్
Advertisement

నిజంగా పవన్ కళ్యాణ్ వైజాగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. జనసేన ఆధ్వర్యంలో వైజాగ్ లో జరిగే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై రాళ్ళు రువ్వారంటూ పోలీస్ లు జనసేన కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. జనవాణి కార్యక్రమానికి పోటీగా వైసిపి నాయకులు విశాఖ గర్జన అంటూ హడావిడి చేసినప్పటికీ.. పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటినుండే ఒణికించారు. అంతమంది మంత్రులు ఉన్నా పవన్ ముందు నిలబడలేకపోయారు. ఎయిర్ పోర్ట్ లో దిగగానే మహిళలు ఆయనకి హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలకడం, పవన్ వైజాగ్ ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పవన్ ర్యాలీ ఘనంగా జరిగింది.  

స్ట్రీట్ లైట్స్ తీసేస్తే.. సెల్ ఫోన్ లైట్స్ వెలుగులో జనసేన ర్యాలీ సగర్వంగా సాగింది. ఎయిర్ పోర్ట్ నుండి నోవెటల్ కి వెళ్ళడానికి ఐదు గంటలు పట్టింది అంటే.. అడుగడుగునా ఎంత జననీరాజనం పట్టారో అర్ధమవుతుంది. జనవాణి కార్యక్రమానికి అంతగా ప్రజల మద్దతు చూసిన జగన్ ప్రభుత్వం వణికిపోయింది. పవన్ కనబడితే జనం ఆగరని తెలిసిన పోలీస్ లు ఆయన్ని ప్రజలకి కనబడకుండా కారులో కూర్చోబెట్టడం దగ్గరనుండి అన్ని విషయాల్లో పవన్ ని ఆయన ర్యాలీ ని అదుపు చెయ్యాలని చూసారు. కానీ అన్ని అడ్డంకులు దాటుకుని పవన్ తన షో ని బ్లాక్ బస్టర్ చేసారు.

పవన్ కి ఉన్న మద్దతు చూసిన వైసిపి ప్రభుత్వం ఇమ్మిడియట్ గా జనవాణి కార్యక్రమాన్ని ఆపెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి నుండి పవన్ కళ్యాణ్ వెళ్లిపోవాలని సూచించింది, ఇది వైఎస్ జగన్ నిస్సహాయతని చూపిస్తుంది. అక్కడే జనసేన సక్సెస్ తో సగర్వంగా తలెత్తుకుంది. ఇది జనంలోకి కూడా వెళ్ళింది. జనసేన కార్యకర్తలని అరెస్ట్ చెయ్యడం, జనవాణి కార్యక్రమాన్ని నిలిపివేయడం అన్ని ప్రజలు చూసారు. అటు టిడిపి నేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసారు. 

విశాఖలో వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన అధినేత @PawanKalyan గారి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గం. ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలి. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అంటూ చంద్రబాబు పవన్ కి మద్దతు తెలిపారు. 

బిజెపి వాళ్ళు కూడా పవన్ కి మద్దతు ప్రకటించడం చూసాక పవన్ కళ్యాణ్ షో బ్లాక్ బస్టర్ కాక ఇంకేం అవుతుంది అంటూ జనసేన కార్యకర్తలు, పవన్ ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

Pawan Kalyan storm shivers Jagan:

Pawan Kalyan explosive blockbuster

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement