బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ టు మొదలు కావడమే రికార్డుల వేటలో పడింది. చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఆహా ఎక్కడికో వెళ్ళిపోయింది. గత శుక్రవారం బాలకృష్ణ బావ గారితో టాక్ షో ని సక్సెస్ ఫుల్ గా నడిపించగా.. సెకండ్ ఎపిసోడ్ కి కుర్ర హీరోలని ఆహ్వానించారు. సిద్దు జొన్నలగడ్డ-విశ్వక్ సేన్ లతో ఓ ఆటాడనుకున్న బాలకృష్ణ ఈ షో కి పవన్ కళ్యాణ్ రాకని తాజా ప్రోమో లో కన్ ఫర్మ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. సీజన్ 2 మొదలవుతుంది అనగానే ఫస్ట్ గెస్ట్ చంద్రబాబు, లాస్ట్ ఎపిసోడ్ అంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ అనే వార్త బయటికి వచ్చేసింది.
ఇప్పుడు బాలకృష్ణ దానిని కన్ ఫర్మ్ చేసారు. సెకండ్ ఎపిసోడ్ కి నిర్మాత నాగ వంశీ వచ్చారు. మిమ్మల్ని త్రివిక్రమ్ వదలరా అనగానే మేమే ఆయన్ని బయటికి పంపించం, మా బ్యానర్ లోనే కట్టిపడేశామనగానే బాలయ్య త్రివిక్రమ్ కి ఫోన్ చేసారు.. ఏంటి మా షోకి ఎప్పుడు వస్తున్నావ్ అని త్రివిక్రమ్ ని అడిగితే మీరు ఎప్పుడంటే అప్పుడే అని అన్నారు. దానితో బాలయ్య వస్తారు.. మీతో పాటు ఎవరిని తీసుకురావాలో తెలుసు కదా అంటూ ఆయనతో పవన్ కళ్యాణ్ వచ్చే విషయాన్ని ఇలా ఇండైరెక్ట్ గా బాలయ్య చెప్పెయ్యడంతో.. పవన్-బాలయ్య ఎపిసోడ్ కోసం నందమూరి-మెగా ఫాన్స్ వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేసేసారు.