బిగ్ బాస్ హోస్ట్ గా నాలుగు సీజన్స్ నుండి నాగార్జున హౌస్ మేట్స్ ని కంట్రోల్ చెయ్యడమే కాదు కంటెస్టెంట్స్ తో కలిసిపోయి బుల్లితెర ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. శని, ఆదివారాల్లో నాగార్జున హోస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే సీజన్ 6 లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ చాలా తెలివిగా, స్ట్రాటజీలు ప్లే చేస్తూ, ఏం మాట్లాడితే బయట ఎలా పోట్రె అవుతుందో అంటూ థింక్ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. టాస్క్ పెరఫార్మెన్స్ వీక్ అయినా బుర్రకి పని చెబుతున్నారు. అయితే హౌస్ లో వాసంతి, కీర్తి భట్ లు నాగార్జున డెసిషన్ నే క్వశ్చన్ చేస్తున్నారు. కీర్తి కెప్టెన్ అయినా తనని నాగార్జున అప్రిషెట్ చెయ్యలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దానితో నాగార్జున నువ్ కెప్టెన్ అయ్యావంటేనే నీ స్ట్రెంత్ అర్ధమవుతుంది అని నచ్చజెప్పారు.
ఇక నిన్న శనివారం ఎపిసోడ్ లో కీర్తి నీ అట యావరేజ్ అనగానే, సర్ నేను ఇప్పుడు మాట్లాడాలి, మీ డెసిషన్ రాంగ్ అనే అర్ధంలో సర్ నేను గుడ్, టాస్క్ బాగా ఆడాను, అందులో ఫైమా కన్నా నేను ఏం తక్కువ ఆడాను అంటూ నాగార్జునని క్వశ్చన్ చెయ్యగా.. నాగార్జున బయట ఆడియన్స్ ని కీర్తి గేమ్ గురించి అడిగారు.. ఫైమా బాగా ఆడుతుందా? కీర్తి బాగా ఆడుతుందా? అని, దానికి ఆడియన్స్ అంతా ఫైమా అన్నారు. అయినా కీర్తి ఒప్పుకోలేదు. కానీ నాగార్జున నువ్ టాస్క్ ఆడినా.. మిగతా విషయాల్లో డల్ అయ్యావ్. ఎంటర్టైన్మెంట్ లేదు అంటూ, బాగా ఆడితే బాగా ఆడావ్ అని మెచ్చుకుంటాం కీర్తి.. నీ ఎంటర్టైన్మెంట్ పెంచుకో అని క్లాస్ పీకారు.