కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని హీరోలు మాస్ గా కాదు ఊరమాస్ గా చూపించడంలో నెంబర్ వన్. ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసినవే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడో రివీల్ చేసి ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ఆ లుక్ లో బొగ్గులో ప్రభాస్ మొహానికి నల్ల రంగు వేసి మాస్ గా, పవర్ ఫుల్ గా చూపించారు. తర్వాత ఆ సినిమా నుండి వచ్చిన జగపతి బాబు లుక్ కూడా ఆల్మోస్ట్ అదేమాదిరి ఉంది. ఇక నేడు సలార్ నుండి అప్ డేట్ రాబోతున్నట్లుగా గత రాత్రి నుండే హడావిడి మొదలు పెట్టారు.
సలార్ లో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే స్పెషల్ గా సలార్ నుండి పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రతి సినిమాలో హ్యాండ్ సమ్ గా స్టైలిష్ గా కనిపించే పృథ్వీరాజ్ సుకుమారన్ కి కూడా ప్రశాంత్ నీల్ బొగ్గు రాసేసి ఊరమాస్ గా తయారు చేసాడు. మెడలో కంకణాలు, ముక్కుకి పోగు, చెవులకి రింగ్ లతో చాలా రఫ్ గా కనిపించారు. Birthday Wishes to the most versatile @PrithviOfficial, Presenting ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ from #Salaar.. అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రని పరిచయం చేసారు. ఎప్పుడూ అందంగా కనిపించే పృథ్వీరాజ్ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ లుక్ లో భయపెట్టేస్తున్నాడు. ఇక అటు మలయాళ ప్రేక్షకులు, ఇటు ప్రభాస్ ఫాన్స్ ఇద్దరూ సలార్ నుంచి వచ్చిన ఈ సాలిడ్ అప్ డేట్ ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.