రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో సూపర్ ఫిట్ గా, మీసకట్టుతో బ్రిటిష్ పోలీస్ అధికారిగా, అల్లూరి గెటప్ లో రామరాజుగా మెగా ఫాన్స్ కి కి మాత్రమే కాదు, సినీ లవర్స్ అందరికి నచ్చే లుక్ లో కనిపించారు. తర్వాత శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న RC15 లో రామ్ చరణ్ లుక్ తరుచూ సెట్స్ నుండి సోషల్ మీడియాలో లీకై చక్కర్లు కొడుతున్నాయి, రామ్ చరణ్ రెండు పాత్రల్లో RC15 లో కనిపించబోతున్నారనేది తెలిసిన విషయమే. అందులో రామ్ చరణ్ సీనియర్ లుక్ అంజలి తో కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ కూడా బయటికి వచ్చింది. శంకర్ RC15 ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యకముందనే రామ్ చరణ్ స్టూడెంట్ లుక్ కూడా బయటికి వచ్చేసింది.
తాజాగా రామ్ చరణ్ తన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ పిక్ లో చరణ్ కాస్త పల్లెటూరివాడిలా పూవుల చొక్కాతో సైడ్ కి నించుని కనిపిస్తున్నాడు. ఆ లుక్ చూసిన మెగా ఫాన్స్ ఇది చరణ్ RC15 లుక్ అంటూ ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో కలిసి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో RC15 షూటింగ్ చిత్రీకరణలో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.