బిగ్ బాస్ సీజన్ 6 ఆరువారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వారం నాగార్జున శనివారం వచ్చి రాగానే రేవంత్ కెప్టెన్సీ అందరూ సూపర్ అన్నారు, కానీ నువ్ చేసిన పని ఏమిటో వీడియోలో చూపిస్తున్నా అంటూ అతను పడుకుని కవర్ చేసిన విషయం తెలియజేసాడు. తర్వాత ఫైమా-రేవంత్ మధ్యలో ఫైట్ జరిగింది. అందులో తప్పెవరిదో చెప్పారు. ఇక ఇనాయకి గట్టిగా క్లాస్ పడింది. మొదటి వారాల్లో బాగా ఆడిన నువ్వు ఇప్పుడు ఆట వదిలిపెట్టి మనుషుల మీద ఫోకస్ పెట్టావ్ అంటూ సూర్య తో ఇనాయ ట్రాక్ పై ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు ఆయన.
ఇక ఈ వారం తొమ్మిదిమంది నామినేషన్స్ లో ఉండగా.. సుదీప ఈ వారం ఆరో హౌస్ మెట్ గా ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు బయటికి వచ్చేసాయి. బాలాదిత్య-సుదీప చివరిగా డేంజర్ జోన్ లో ఉండగా.. అక్కడ బాలాదిత్య సేవ్ అయ్యి.. సుదీప ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే గత మూడు వారాలుగా ఎలిమినేషన్ తప్పించుకుంటూ సేవ్ అయిన సుదీప ఫైనల్లీ ఈ వారం బయటికి వెళ్ళింది. ఇప్పటికే హౌస్ నుండి షాని, అభినయ, నేహా చౌదరి, ఆరోహి, చంటి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లగా ఈ వారం పింకీ సుదీప ఎలిమినేట్ అయ్యింది. సుదీప ఎలిమినేషన్ ఎపిసోడ్ రేపు సన్ డే నైట్ ప్రసారం కాబోతుంది.