Advertisementt

సర్దార్-జవాన్ కనెక్షన్ ఏమిటి?

Sat 15th Oct 2022 01:03 PM
shah rukh khan,jawan,karthi,sardar movie  సర్దార్-జవాన్ కనెక్షన్ ఏమిటి?
Jawan And Sardar Movie Same Stories సర్దార్-జవాన్ కనెక్షన్ ఏమిటి?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో హీరో కార్తీ నటించిన సర్దార్ మూవీ దివాళికి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. సర్దార్ లో కార్తీ రకరకాల గెటప్స్ లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా తమిళంలో పొన్నియన్ సెల్వన్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కార్తీ నుండి రాబోతున్న సర్దార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సర్దార్ పై ఓ న్యూస్ కార్తినే కాదు, ఆయన ఫాన్స్ ని కూడా షేక్ చేస్తుంది. అది సర్దార్ కథకి, తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ కథకి పోలికలున్నాయంటూ ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్- నయనతార కలయికలో తెరకెక్కుతున్న జవాన్, అలాగే కార్తీ నటించిన సర్దార్ చిత్రాలు కూడా ఒకే కథ తో తెరకెక్కాయని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సర్దార్ రిలీజ్ అయ్యాక అట్లీ-షారుఖ్ లు తమ కథని పోల్చి చూసుకుని కంగారు పెడతారేమో అంటున్నారు. ఒకవేళ రెండు సినిమాల కథలకి ఒకే పోలిక ఉంటే షారుఖ్ జవాన్ కి కష్టమే అంటున్నారు. ఎందుకంటే సర్దార్ జవాన్ కన్నా ముందే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి సేఫ్ అవుతుంది.

Jawan And Sardar Movie Same Stories:

Shah Rukh Khan Jawan And Karthi Sardar Movie Same Stories

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ