పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు లో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా హైలెట్ అయిన నిధి అగర్వాల్ తాజాగా సినిమా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ గా కాదు హాట్ టాపిక్ గా మారాయి. అక్కినేని హీరోలు తో టాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ గా నటించిన నిధి అగర్వాల్ కి పవన్ కళ్యాణ్ ఆఫర్ రావడం నిజంగా గొప్పే. ఇప్పుడు ప్రభాస్-మారుతీ ప్రాజెక్ట్ లోను నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది అనే న్యూస్ కూడా మొదలయ్యింది. ఇలాంటి టైమ్ లో నిధి అగర్వాల్ గ్లామర్ షో చేస్తేనే సినిమా ఆఫర్స్ వస్తాయి, టాలెంట్ మాత్రమే సరిపోదు, అందం కూడా ఉండాలి. నటనను మెచ్చి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇండస్ట్రీలో ఉన్నవారంతా హీరోయిన్ అందంగా ఉందా.. లేదా.. అనే చూస్తారు. ఆమె టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉంటారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ షో చేసి అందాలు ఆరబొయ్యడమే పని, ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే నేను గ్లామర్ షో చెయ్యడానికి అడ్డు చెప్పను, డైరెక్టర్స్ ఏది అడిగితే అదే చేస్తాను. అంతేకాకుండా స్టార్ హీరోల అవకాశాలు వస్తే అస్సలు వదులుకోను. రెమ్యునరేషన్ కూడా ఎంతిస్తే అంతే తీసుకుంటాను. డిమాండ్ చెయ్యను కానీ మినిమమ్ ఇంతని చెబుతాను, ఎందుకంటే స్టార్ ఛాన్సెస్ వస్తే.. తర్వాత కెరీర్ నిలబడుతుంది అనేది నా ఉద్దేశ్యం అంటూ నిధి అగర్వాల్ హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.