Advertisementt

మెగా 154: రవితేజ రోల్ రివీల్డ్

Fri 14th Oct 2022 11:04 PM
mega 154,raviteja,chiranjeevi  మెగా 154: రవితేజ రోల్ రివీల్డ్
Mega 154 : Raviteja Role Revealed మెగా 154: రవితేజ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబోలో క్రేజీ మాస్ ఎంటర్టైనర్ లా తెరకెక్కుతున్న మెగా 154 అప్ డేట్స్ వరసగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దివాళికి మెగా టైటిల్ మాత్రమే కాదు, గ్లిమ్ప్స్ తో మెగా ఫాన్స్ కి పూనకాలిచ్చే ట్రీట్స్ రాబోతున్నాయి. ఇంతలో దేవిశ్రీ ప్రసాద్ మెగా 154 పై అంచనాలు మరింతగా పెంచుతూ.. కంగ్రాట్స్ డియర్ సర్‌జీ. నీ కల నిజం కాబోతుంది. దీపావళి టీజర్‌పై ఆసక్తిగా ఉన్నా. చిరంజీవి సార్ ఫైర్‌గా కనిపించారు. దీనికోసం బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాను అంటూ ట్వీట్ చెయ్యడంతో.. దర్శకుడు బాబీ కూడా థ్యాంక్యూ సర్‌జీ. మీరు మీ వర్క్‌తో టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారని మేము నమ్మకంతో ఉన్నాము. ఈ దీపావళికి ప్రేక్షకులందరికీ మా బాస్ ఫస్ట్ గ్లిమ్స్‌ను చూపించడానికి ఆగలేకపోతున్నాము అంటూ రీ ట్వీట్ చెయ్యడంతో ఆ మెగా గ్లిమ్ప్స్ పై ఆసక్తి, ఆత్రుత ఎక్కువైపోతోంది.

ఇక ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న రవితేజ చిరుకి తమ్ముడిగా, సవతి సోదరుడిగా కనిపించబోతున్నాడంటూ ఎప్పటినుండో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా రవితేజ మెగా 154 లో వైజాగ్ రంగారావు పాత్రలో ఔట్ అండ్ ఔట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. రవితేజ పోలీస్ కేరెక్టర్ లో మాస్ వీరయ్య అదేనండి మెగాస్టార్ ని ముప్పుతిప్పలు పెడతాడనే న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ దివాళికి మెగా 154 ముచ్చట్లన్నీ ఆల్మోస్ట్ రివీల్ అవ్వడం ఖాయంగా కనబడుతుంది.

Mega 154 : Raviteja Role Revealed:

Mega 154 : Raviteja character name speculated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ