బాలకృష్ణ టాక్ షో ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 వచ్చేసింది. బావ చంద్రబాబు తో బాలయ్య టాక్ షో.. క్రేజీ అంచనాలు నడుమ నేడు స్ట్రీమింగ్ వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు - బాలకృష్ణ ల మధ్యన జరిగిన ఈ టాక్ షో లో పొలిటికల్, ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలే కాదు, మధ్యలో నారా లోకేష్ ఎంట్రీ, బాలయ్య స్టయిల్, చంద్రబాబు ఫన్నీ అండ్ ఎమోషనల్ కామెంట్స్ షో కె హైలెట్ గా నిలిచాయి. కేవలం రాజకీయాలే కాదు, చంద్రబాబు వయసులో చేసిన చిలిపి పనులు, సీనియర్ ఎన్టీఆర్ తో పరిచయం, ఆయన పెళ్లి ఇలా చాలా విషయాలు ఈ షో ద్వారా బయటికి వచ్చాయి.
అంతేకాకుండా కోడలు నారా బ్రహ్మణికి చంద్రబాబు షో మధ్యలో ఫోన్ చెయ్యడం, ఫోన్ లో బ్రాహ్మణి పేరుని ఏమని ఫీడ్ చేసావ్ బావ అని అడిగిన బాలయ్యకి నారా బ్రాహ్మణి అనగానే నారా అంటే నందమూరి కూడా బావ అన్నారు ఆయన. ఇక బ్రాహ్మణి మావగారి ఫోన్ ఎత్తి గుడ్ ఆఫ్టర్ నూన్ మామయ్య అంటూ చెప్పగానే.. తాను బాలయ్య షోలో ఉన్నానని.. నాతో బాలయ్య ఆటలు ఆడుకుంటున్నారన్నారంటూ చంద్రబాబు ఫన్నీగా మట్లాడారు. దానితో బాలయ్య తనకి కూతురు అంటే భయమని చెప్పారు. ఇక బ్రాహ్మణి కూడా నాన్న అన్‌స్టాపబుల్తో పాటు. అన్‌కంట్రోలబుల్ అంటూ.. కామెంట్స్ చేసింది. బ్రాహ్మణి చాలా పవర్ ఫుల్ లేడీ అంటూ మెచ్చుకున్నారు చంద్రబాబు. అంతేకాదు ఈ షో సాక్షిగా నారా ఫ్యామిలీ ఓ మంచి చేతుల్లో ఉందంటూ బ్రహ్మాణిపై ప్రశంసలు కురిపంచారు చంద్రబాబు.