అక్టోబర్ 5 బుధవారం దసరా పండగ స్పెషల్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ కి హిట్ టాక్ పడడంతో ఆ వారం మొత్తం కలెక్షన్స్ కళకళలాడాయి. గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ద ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతి ముత్యం విడుదల కాగా.. అందులో గాడ్ ఫాదర్ హిట్ అవగా.. స్వాతి ముత్యం సో సో అనిపించింది. ఘోస్ట్ డిసాస్టర్ అవడంతో గాడ్ ఫాదర్ సూపర్ హిట్ అయ్యింది. ఎనిమిదిరోజులుపాటు ఎదురులేని గాడ్ ఫాదర్ కి ఈ వారం ఎమన్నా షాక్ తగులుతుందేమో అనుకున్నారు.
పెద్దగా పేరులేని సినిమాలే అయిన.. కంటెంట్ బలంగా ఉంటే గాడ్ ఫాదర్ కి చుక్కెదురవుతుందేమో అనుకుంటే.. ఈవారం ఏ సినిమా కూడా థియేటర్స్ లో ప్రేక్షులని కుర్చీల్లో కూర్చోబెట్టలేకపోయాయి. ఆది సాయి కుమార్ క్రేజీ ఫెలో కానీ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ కానీ గీత, నీతో ఇలా ఏ సినిమా కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. దానితో మరో వారం గాడ్ ఫాదర్ కి అవకాశం దొరికింది. మళ్ళీ దివాళి మూవీస్ వచ్చేవరకు గాడ్ ఫాదర్ కుమ్ముకోవచ్చు. ఈ వారం గాడ్ ఫాదర్ కలెక్షన్స్ పెరిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేదంటే నిర్మాతకి ఎంతో కొంత లాస్ అయితే తప్పేలా లేదు.