Advertisementt

సందడి లేని శుక్రవారం

Fri 14th Oct 2022 10:04 AM
crazy fellow,october 14,boy friend for hire  సందడి లేని శుక్రవారం
Today releases సందడి లేని శుక్రవారం
Advertisement
Ads by CJ

ఈ రోజు శుక్రవారం. శుక్రవారం అంటే సినిమా వాళ్ళకి పండగే. ఈ రోజు మూవీ లవర్స్ కూడా థియేటర్స్ లోకి ఏ సినిమా వస్తుందా.. ఓటిటిలో ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే రోజు కూడా. ప్రతి శుక్రవారం సినిమాల రిలీజ్ లతో హడావిడిగా ఉండే బాక్సాఫీసు నేడు కూడా అదే మాదిరి హడావిడి పడుతుంది. అయితే ఏ పెద్ద సినిమానో, లేదంటే క్రేజ్ ఉన్న మూవీస్ రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల కోలాహలం కనబడుతుంది. నేడు రిలీజ్ అవ్వబోయే సినిమాల్లో ఒకటో రెండో కాస్త పేరున్న సినిమాలు. మిగతావన్నీ చిన్న చిన్న సినిమాలే.

అందులో ఆది సాయి కుమార్ నటించిన క్రేజీ ఫెలో తో పాటుగా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ మూవీస్ కొద్దిగా ప్రమోషన్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని తీసుకొచ్చిన సినిమాలు. కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన ఆది సాయి కుమార్ ఈ క్రేజీ ఫెలో హిట్ కోసం ఎంతో నమ్మకంతో ఉన్నాడు. కానీ పెద్దగా సందడి లేకుండానే సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది క్రేజీ ఫెలో. ఇక బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అంటూ టీం హడావిడి చేసినా.. చిన్న సినిమా, అలాగే తెలిసిన మొహాలేవీ ఆ సినిమాలో లేకపోవడం ఆ సినిమాకి మైనస్. మరి హంగామా ప్రమోషన్స్ తో దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

వీటితో పాటుగా గీత, నీతో, రుద్రనేత్రి, నా వెంటపడుతున్న చిన్నవాడెవమ్మా సినిమాలు కూడా నేడు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అలాగే హిందీ నుండి రకుల్ ప్రీత్ డాక్టర్ జి, మోడీ జి కి భేటీ కూడా నేడే విడుదలవుతున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. 

Today releases :

Crazy Fellow and many more releasing on October 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ