Advertisementt

నయన్ సరోగసీపై విచారణ మొదలు

Thu 13th Oct 2022 10:58 PM
nayanthara,vignesh shivan,surrogacy  నయన్ సరోగసీపై విచారణ మొదలు
Nayanthara twins and surrogacy controversy నయన్ సరోగసీపై విచారణ మొదలు
Advertisement
Ads by CJ

నయనతార పెళ్లి తర్వాత ఎదుర్కున్న కాంట్రవర్సీలు స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత తిరుమల మాఢవీధుల్లో కాళ్ళకి చెప్పులు ధరించి కాంట్రవర్సీకి కారణమైతే.. టిటిడి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. దానితో అక్కడ విగ్నేష్ శివన్ సారి చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లి అయ్యి నాలుగు నెలలు తిరిగేలోపు నయనతార-విగ్నేష్ లు కవల పిల్లలకి తల్లితండ్రులవడం విచిత్రం అలా ఉంచి.. సరోగసి ద్వారా తల్లితండ్రులవడం వాళ్ళని చిక్కుల్లో పడేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఈ జంట సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారనే వార్తలు తమిళనాడు ప్రభుత్వాన్ని షేక్ చేసింది. 

దానితో స్టాలిన్ ప్రభుత్వం నయనతార సరోగసి ప్రాసెస్ పై విచారణ చేపట్టింది. తమిళనాడు హెల్త్ మినిస్టర్ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా నయన్ కి పిల్లలు పుట్టిన ఆస్పత్రి నుంచి దర్యాప్తును ప్రారంభించి విచారణ చేపట్టనున్నట్టుగా సమాచారం. ఈ విషయమై నయనతార-విగ్నేష్ లీగల్ గా చిక్కులు ఎదుర్కోవడమే కాదు, విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది. మరి ఈ విషయమై ఈ దంపతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Nayanthara twins and surrogacy controversy:

A three-member committee to probe whether Nayanthara and Vignesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ