బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. రామ్ చరణ్ తో మూడు భాషల్లో RC15 చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ బిజీగా ఉంటున్న కియారా అద్వానీ అక్కడ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమాయణం నడుపుతుంది. ఇద్దరూ బహిరంగంగా ప్రేమ గురించి చెప్పకపోయినా.. వారి మధ్యలో ప్రేమ ఉందనేది బాలీవుడ్ కన్ఫర్మ్ చేస్తున్న న్యూస్. రీసెంట్ గా కరణ్ జోహార్ షోలో కూడా కియారా వీరి ప్రేమపై ఇండైరెక్ట్ గా స్పందించింది, కన్ ఫర్మ్ చేసింది.
అయితే వచ్చే ఏడాది 2023 లో కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా వివాహం చేసుకుంటారని, అది కూడా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లా సీక్రెట్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇరు కుటంబాలు ప్లాన్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే సిద్దార్థ్ మల్హోత్రా మాత్రం తానెంత సీక్రెట్ గా వివాహం చేసుకున్నా.. అది బయటికి వచ్చేస్తుంది అంటూ ఫన్నీగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.