మహేష్ బాబు కొద్దిరోజులుగా తల్లి మరణంతో కుంగిపోయి.. ఆమెకి చెయ్యాల్సిన కార్యక్రమాలు(దశదిన కర్మలు) పూర్తి చేసారు. మహేష్ తల్లి ఇందిరగారి మరణంతో ఆయన్ని పరామర్శించేందుకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి వెళ్లారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు మళ్ళీ డైలీ రొటీన్ లోకి వచ్చేసారు. అంటే త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. దానిలో భాగంగా మహేష్ బాబు సూపర్ ఫిట్ గా మేకోవర్ అవుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్ట్రా క్లాస్ లుక్ లో మహేష్ బాబు తో ప్రముఖ స్టయిలిస్ట్ ఆలిం హకీమ్ సెల్ఫీ తీసుకున్న పిక్ అది. మహేష్ బాబు షర్ట్ బటన్స్ తీసేసి.. స్మోకింగ్ హాట్ లుక్ లో కనిపించారు. మరి త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న SSMB28 లో మహేష్ లుక్ పై రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ.. మహేష్ మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ లోనే కనిపించబోతున్నట్లుగా ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఆయన ఫాన్స్. ఈ వారంలో SSMB28 సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కాబోతుంది.