ఎన్టీఆర్ ప్రస్తుతం కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఖాళీగా ఉన్నారు. ఈలోపు ఎన్టీఆర్ ని తెలుగు తమ్ముళ్లు, వైసీపీ నాయకులు పోలిటికల్ గా ఇరికించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించని వాళ్ళే లేరు. తాజాగా ఎన్టీఆర్ కి ఒకప్పుడు ప్రాణ సేహితుడు వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ మట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు, అటు పొలిటికల్ గా ఇటు సినిమాల పరంగా ముగ్గురు క్లోజ్ గా ఉన్నారు. తర్వాత వంశి, నాని టీడీపీని వదిలేసాక వీరి స్నేహం మళ్ళీ హైలెట్ అవ్వలేదు. కానీ వంశీ, కొడాలి నాని ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు.
తాజాగా వల్లభనేని వంశీ మీడియా తో మట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకి తానుగా పైకి ఎదిగాడు, ఎన్టీఆర్ ని ఎవరూ (ఫ్యామిలీ కానీ, పార్టీ కానీ) పైకి తీసుకురాలేదు. ఆయన గురించిన అంతర్గత రహస్యాలు చెబితే ఎవరికీ నిద్ర పట్టదు. గతంలో టిడిపికి ప్రచారం చేసారు. ఆయన్ని వాడుకుని కరివేపాకులా వదిలేసారు. పెళ్లి విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ ఆయన కష్టపడ్డారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ కెరీర్ని చక్కదిద్దుకుంటున్నాడు. ఆయన అక్కర్లేదు అన్నప్పుడు మీకు కావలసినప్పుడు ఆయన్ని మధ్యలోకి లాగి ఇబ్బంది పెట్టడం సబబు కాదు అంటూ వంశీ మాట్లాడిన మాటలు తగలాల్సిన వాళ్ళకి తగిలాయి అంటూ అందరూ చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా డైరెక్ట్ గానే ఎన్టీఆర్ కి తన స్నేహితుడు మద్దతు ఇవ్వడం కూడా చర్చలకు దారి తీసింది.