పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ వార్తలు సోషల్ మీడియాలో ఆగడం లేదు. నిన్నమొన్నటివరకు అప్ డేట్ కోసం ఆత్రుత పడిన ప్రభాస్ ఫాన్స్ నేడు.. ఆదిపురుష్ విషయంలో బెంగ పడిపోతున్నారు. ఆదిపురుష్ టీజర్ చూసాక వాళ్ళ నెత్తిన పిడుగు పడింది. అంతేకాకుండా ఇప్పుడు ఆదిపురుష్ టీమ్ లీగల్ ప్రోబ్లెంస్ తో సఫర్ అవుతుంది. అసలే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ డిజాస్టర్స్ చూసాక ఆదిపురుష్ అయినా ప్రభాస్ కి సక్సెస్ ఇచ్చి ఊపు తెస్తుంది అనుకుంటే.. ఆదిపురుష్ ప్రభాస్ ఫాన్స్ అంచనాలకు దూరంగా ఉంది. 3D టీజర్ చూసాక కాస్త కూల్ అయినా.. ఈ ఆదిపురుష్ అందరికి నచ్చుతోందా.. అనే దిగులు వాళ్లలో కనబడుతుంది.
వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సీత కేరెక్టర్ లో కనిపించిన కృతి సనన్ ఆదిపురుష్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఆదిపురుష్ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టినట్టుగా గెట్ సెట్ డబ్ అంటూ కృతి సనన్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ప్రభాస్ డైలాగ్స్ ఆల్రెడీ టీజర్ లో వీక్షించిన ప్రభాస్ ఫాన్స్ ఈ విషయంలో ఆనందంతోనే ఉన్నారు. ఇక ప్రభాస్ బర్త్ డే కి ఆదిపురుష్ నుండి మళ్ళీ ఎలాంటి ట్రీట్ ప్లాన్ చేసారో చూడాలి.