నటి కీర్తి సురేష్ ఈ మధ్యన బరువు తగ్గి అందవిహీనంగా తయారయ్యింది. గ్లామర్ డోస్ పెంచి.. మొహంలో కళను పోగొట్టుకుంది. మహేష్ బాబు తో చేసిన సర్కారు వారి పాటలో చాలా చోట్ల కీర్తి సురేష్ ని చూడలేకపోయారు. గ్లామర్ తో చాలావరకు కవర్ చేసినా.. ఆమె ఫేస్ ఆమెని వెక్కిరించింది. అయితే తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కారణం ఆమె NTR30 ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అని. అంటే ఎన్టీఆర్ తో కలిస్ నటించేందుకు వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంటూ ఆమెని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు.
కొరటాలతో ఎన్టీఆర్ చేయబోతే ఎన్టీఆర్30 లో కీర్తి సురేష్ కి హీరోయిన్ గా ఆఫర్ రాగా.. ఆమె దానిని రిజెక్ట్ చేసిందట. అయితే ఇదంతా ఒట్టి రూమర్ అని తెలుస్తుంది. అసలు కీర్తి సురేష్ రేంజ్ కి ఎన్టీఆర్ ఆఫర్ రిజెక్ట్ చేసే అంత సీన్ ఉందా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఏసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చేసి ప్లాప్ అందుకుంది, తర్వాత కోలీవుడ్ లోనూ వరసగా ప్లాప్ మూవీస్ చేసిన కీర్తి సురేష్ కి ఒకే ఒక్క స్టార్ హీరో మహేష్ ఆఫర్ తగిలింది. తర్వాత కీర్తి సురేష్ కి తెలుగులో స్టార్ ఆఫర్ ఒక్కటి లేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ రాగా.. దానిని ఆమె రిజెక్ట్ చేసింది అనే న్యూస్ ఎంతవరకు నిజం అనేది ఆ రూమర్ క్రియేట్ చేసిన వారికే తెలియాలి. చాలామంది ఇది జస్ట్ సిల్లీ రూమర్ అని కొట్టేపారేస్తున్నారు.