అల్లు అర్జున్-సుకుమార్ కలిసి పుష్ప 2 షూటింగ్ కి రెడీ అవ్వబోతున్నారు. ఈ నెలాఖరు నుండి పుష్ప పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది అని, మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరిస్తారని పుష్ప నిర్మాత క్లారిటీ కూడా ఇచ్చారు. దానిలో అల్లు ఫాన్స్ ఫుల్ హ్యాపీ. ఇక పుష్ప పార్ట్ 1 లో ఫహద్ ఫాసిల్ విలనిజాన్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేసారు. సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్. కాకపోతే ఈ మధ్యన విజయ్ సేతుపతి మరో విలన్ గా సుకుమార్ ఎంపిక చేయబోతున్నారని అన్నారు. ఆ తర్వాత రీసెంట్ గా బాలీవుడ్ అర్జున్ కపూర్ పుష్ప పార్ట్ 2 లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది అన్నారు.
తాజాగా అర్జున్ కపూర్ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు అనే విషయం పై ప్రకటన లేకపోయినా.. ఆ వారితః సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టింది. అర్జున్ కపూర్ పుష్ప పార్ట్ 2 లో మాస్ గా నెగెటివ్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారానికి పుష్ప నిర్మాత నవీన్ యెర్నేని అడ్డుకట్ట వేశారు. అది కేవలం రూమర్ అని, ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు. అంతేకాకుండా సెకండ్ పార్ట్‌లో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ చాలా కీలకమని, అలాంటిది ఆ స్థానంలో మరొకరిని ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారని తెలుస్తోంది. అసలు పుష్పలో విలన్ క్యారెక్టర్ 100 పర్సెంట్ ఫహద్ ఫజిల్ లాంటి నటుడే న్యాయం చేయగలడని, అలాంటి కేరెక్టర్ ఉండగా మరో విలన్ అవసరం లేదని అర్జున్ కపూర్ పుష్ప పార్ట్2 లో నటిస్తాడని వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు.