విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే, లవర్స్ లా విహారయాత్రలు చేస్తారు. అలాగే లేట్ నైట్ డిన్నర్ డేట్స్ కి వెళుతుంటారు. సోషల్ మీడియాలో వీరిద్దరిపై ఎంతగా ప్రచారం జరిగినా మేము ఫ్రెండ్స్ అంటూ గొంతెత్తి చెబుతారు. గతంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవాలో తేలిన విజయ్ దేవరకొండ-రష్మికలు రీసెంట్ గా మాల్దీవులకు పయనమయ్యారు. వీరు విడివిడిగానే ఫ్లైట్ ఎక్కడానికి వచ్చి ఎయిర్ పోర్ట్ లో కనిపించినా.. వెళ్ళింది ఒకేరోజు, ఒకే చోటుకి, అది కూడా లవర్స్ వెళ్లే మాల్దీవులకి. యాదృచ్చికంగా ఇద్దరూ వెళితే ఇలా జరగదు. అనుకుని వెళితే తప్ప.
ఇక మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి కనిపించలేదు కానీ.. రష్మిక అక్కడ ఎంతగా ఎంజాయ్ చెసింతో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ చూస్తే తెలిసిపోతుంది. చాలా గ్లామర్ గా రష్మిక అందాల ఆరబోత మాల్దీవుల్లో ఉంది. అలాగే పూల్ లంచ్ అంటూ హడావిడి చేసింది. ఇక ఈ రోజు రష్మిక అండ్ విజయ్ దేవరకొండ మాల్దీవుల ట్రిప్ ముగించేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరూ మళ్ళీ ఎయిర్ పోర్ట్ లో విడివిడిగానే కనిపించారు. మరి మీడియాకి దొరక్కుండా ఏం చేసినా.. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ మాత్రం పడడమే లేదు.