Advertisementt

సరోగసి రచ్చ: విగ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Wed 12th Oct 2022 02:29 PM
nayanthara,vignesh shivan,negative trolls  సరోగసి రచ్చ: విగ్నేష్ శివన్ పోస్ట్ వైరల్
Vignesh strong message on negative trolls సరోగసి రచ్చ: విగ్నేష్ శివన్ పోస్ట్ వైరల్
Advertisement
Ads by CJ

పెళ్ళై మూడు నెలలు తిరిగే లోపు టాప్ హీరోయిన్ నయనతార-విగ్నేష్ శివన్ ల చేతిలోకి కవల మగ పిల్లలు వచ్చి పడ్డారు. సెకండ్ హనీమూన్ నుండి తిరిగొచ్చిన కొద్దిరోజులకే నయనతార-విగ్నేష్ శివన్ లు తాము తల్లితండ్రులమయ్యాం అంటూ సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నయన్-విగ్నేష్ లు తల్లితండ్రులమయ్యామని చెప్పారో.. లేదో.. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత నయనతార గర్భం దాల్చకుండా సరోగసి ద్వారా తల్లి అయిన విషయం బయటికి వచ్చింది. 

దానితో అదో పెద్ద సెన్సేషన్ న్యూస్ అవడమే కాదు, నయనతార- విగ్నేష్ శివన్ ల సరోగసి వ్యవహారం తమిళనాడు అసెంబ్లీ లో హాట్ టాపిక్ అవడం, తమిళనాడు మినిస్టర్ ఈ విషయమై దర్యాప్తు చేపడతాను అంటూ ప్రకటించడంతో ఈ దుమారం గాలివానలా మారింది. ఇలాంటి సమయంలో విగ్నేష్ శివన్ చేసిన ఓ పోస్ట్ సోషల్లో మీడియా వైరల్ అయ్యింది. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ.. నీ గురించే ఆలోచించే వారు గురించే పట్టించుకో.. ఎందుకంటే వాళ్ళే నీవాళ్ళు, ఎన్నటికీ ఇదే నిజం. టైం వచ్చినప్పుడు అన్ని అందరికి చేరుతాయి. అప్పటివరకు ఓపిక పట్టు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు.. అంటూ ట్రోలర్స్ కి ఇండైరెక్ట్ గా పంచ్ వేస్తూ నయనతారకి సపోర్ట్ గా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vignesh strong message on negative trolls:

Nayanthara husband Vignesh strong message on negative trolls

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ