ఈమధ్యన టాలీవుడ్ హీరోలు చాలామంది రీమేక్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒరిజినల్ కథ కన్నా రీమేక్ అయితే సేఫ్ అనే థాట్ లో చాలామంది హీరోలు, ముఖ్యంగా సీనియర్ హీరోలు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్స్ చేసి హిట్స్ కొట్టారు. ఇక మెగాస్టార్ చిరు 9 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక కత్తి రీమేక్ చేసారు. అలాగే రీసెంట్ గా లూసిఫర్ రీమేక్ తో హిట్ కొట్టారు. అలాగే తమిళ వేదాళం ని భోళా శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఇక వెంకీ కూడా ప్రస్తుతం ఓరి దేవుడా మూవీ చేసారు.
అయితే ఇప్పుడు మలయాళంలో మోహన్ లాల్ నటించిన మోనిస్టర్ పై చిరు తో పాటుగా నాగార్జున, వెంకీ కన్నేసినట్లుగా తెలుస్తుంది. మోహన్ లాల్ మోనిస్టర్ దివాళి కి రిలీజ్ అవుతుంది. అది గనక హిట్ అయితే ఈ సినిమాని రీమేక్ చేసేందుకు చిరు తో పాటుగా నాగార్జున, వెంకటేష్ పోటీపడతారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీపై ఈ ముగ్గురు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని, రిలీజ్ అయ్యాక ఫలితాన్ని బట్టి రీమేక్ చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారని తెలుస్తుంది.