Advertisementt

అందరి చూపు అఖిల్ ఏజెంట్ పైనే

Wed 12th Oct 2022 10:52 AM
akkineni fans,akhil,agent movie  అందరి చూపు అఖిల్ ఏజెంట్ పైనే
All eyes are on Akhil Agent movie అందరి చూపు అఖిల్ ఏజెంట్ పైనే
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అక్కినేని ఫాన్స్ ఫుల్ గా డిస్పాయింట్ అయ్యి ఉన్నారు. గత ఏడాది ఈ సమయంలో నాగ చైతన్య-సమంత విడిపోవడం వాళ్ళని బాగా బాధపెట్టింది. తర్వాత నాగ చైతన్య లవ్ స్టోరీ తో హిట్ కొట్టాడు. ఈ ఏడాది బంగార్రాజు తో చైతు - నాగ్ లు హిట్ అనిపించారు. ఇక నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా డిసాస్టర్ అవడం, నాగార్జున బ్రహ్మాస్త్ర అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో ఆ విషయంలోనూ అక్కినేని ఫాన్స్ మధనపడ్డారు. ఇక తాజాగా నాగార్జున ఘోస్ట్ కూడా డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లడం వాళ్ళని మరింతగా బాధపెట్టింది.

అయినప్పటికీ అక్కినేని యంగ్ హీరో అఖిల్ నుండి రాబోయే పాన్ ఇండియా ఫిలిం ఏజెంట్ పైనే వారు నమ్మకం పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. ఆ డేట్ ని వాయిదా వేశారు మేకర్స్. మధ్యలో ఏజెంట్ షూటింగ్ ఆగిపోయింది, ఏజెంట్ కి రిపేర్లు అంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఏజెంట్ అప్ డేట్ లేకపోవడంతో ఏజెంట్ విషయంలో ఏం జరుగుతుందో  తెలియక అక్కినేని ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మొదటి హిట్ అందుకున్న అఖిల్.. ఏజెంట్ తో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా.. అనే సందేహం చాలామందిలో ఉంటే.. ఏజెంట్ తో పక్కా హిట్ కొట్టడం ఖాయమని అక్కినేని ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఏజెంట్ విషయం తేల్చి రిలీజ్ డేట్ ఇస్తేనే ఫాన్స్ కూల్ అవుతారు.. లేదంటే వాళ్ళ ఆందోళన మరింతగా పెరిగిపోతుంది.

All eyes are on Akhil Agent movie:

Akkineni fans request: Akhil Agent update please

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ