పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి రేపు డిసెంబర్ కి ఖచ్చితంగా ఏడాది పూర్తవుతుంది. అంటే మరో రెండు నెలల్లో వన్ ఇయర్ పూర్తవుతుందన్నమాట. పుష్ప పార్ట్ 1 వచ్చాక ఏడాదికి కూడా పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టలేదు టీమ్. గత నెలలో పూజా కార్యక్రమాలు చేసిన.. రెగ్యులర్ షూట్ పై ఎలాంటి అప్ డేట్ లేకుండా కామ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఈ గ్యాప్ లో యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నారు. సుకుమార్ కూడా కమర్షియల్ యాడ్స్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈనెల 1 వ తేదీ అల్లు రామలింగయ్య జయంతి ఉత్సవాలు, అల్లు స్టూడియో ఓపినింగ్ రోజున పుష్ప రెగ్యులర్ షూటింగ్ అన్నప్పటికీ అది జరగలేదు.
దానితో అల్లు అర్జున్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. అసలు పుష్ప ద రూల్ రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక అల్లు ఫాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు. అయితే సుకుమార్ పుష్ప ద రూల్ షూటింగ్ చాలావరకు పార్ట్ 1 టైమ్ లోనే అప్పుడే కానిచ్చేయడంతో మేకర్స్ కూడా కూల్ గా ఉన్నారట. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరు నవీన్ యెర్నేని పుష్ప పార్ట్ 2 రెగ్యులర్ షూట్ పై క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ నెలాఖరు నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభంకాబోతుందని చెప్పిన ఆయన అక్టోబర్ 20 నుండి 30వ తారీఖుల మధ్య షూటింగ్ ఉండబోతుందని, పుష్ప ద రూల్ మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగించేసి, తరువాత ఫారెస్ట్ తో పాటుగా ఇతర లొకేషన్లకు వెళతాం అంటూ నవీన్ యెర్నేని పుష్ప2 పై బిగ్గెస్ట్ అప్ డేట్ ఇచ్చారు.