Advertisementt

అల్లు-మెగా విభేదాలపై అరవింద్ క్లారిటీ

Tue 11th Oct 2022 06:08 PM
allu aravind,chiranjeevi,mega family  అల్లు-మెగా విభేదాలపై అరవింద్ క్లారిటీ
Arvind Aravind Clarity on Allu-Mega differences అల్లు-మెగా విభేదాలపై అరవింద్ క్లారిటీ
Advertisement
Ads by CJ

ఈటీవీలో ప్రసారమవుతున్న అలీ తో సరదాగా షో లో అల్లు అరవింద్ ని వ్యాఖ్యాత అలీ ఓ కాంట్రవర్సీ ప్రశ్నకి సమాధానం చెప్పమనగానే అరవింద్ గారు కాస్త ఫైర్ అయినప్పటికీ.. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి ఉన్న డిస్టబెన్సెస్ ని ఒక్క ముక్కలో తేల్చేసారు. ఇండస్ట్రీ అలాగే బయట చాలామంది అరవింద్ గారి ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి ఒక చిన డిస్టబెన్స్ వచ్చింది అనే ఒక టాక్ అయితే ఉంది. దానికి మీ సమాధానం ఏమిటి అని అడగగా.. దానికి అరవింద్ కొద్దిగా కోపం తెచ్చుకున్నప్పటికీ.. తర్వాత కూల్ గా ఆన్సర్ ఇచ్చారు. బయట అల్లు అరవింద్ కి చిరుకి మధ్యన ఘర్షణ జరుగుతుంది అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.. దాన్ని మనం తెగ్గొట్టేద్దామా అనగానే అరవింద్ గారు.. ఇదంతా చాలా సహజం. ఎందుకంటే ఆ 80 ల నుండి ఒకళ్ళనొకళ్ళం మంచి ఫ్రెండ్స్ అలానే పైకొచ్చాం కూడా. 

మేము బావమర్థులం లా కాదు, స్నేహితులుగానే పైకొచ్చాం. అలానే మా కుటుంబాలు పెరిగాయి. మాకు పిల్లలు పుట్టారు. ఇదే వృత్తిలో ఉన్నారు. ఫిలిం సొసైటీలో అవకాశాలు పంచుకున్నారు. దానిలో కాంపిటీషన్ అనేది తప్పదు. అలా కాంపిటీషన్ తోనే పెరుగుతున్నారు. అలాంటి సమయంలో ప్రజలు ఇలా అనుకోవడం తప్పులేదు. కానీ ప్రజలు గ్రహించాల్సింది ఒక్కటే. వీరంతా ఒక్కటే, ఎవరి మీద మాట పడినా అందరూ ఒకే మాట మీద ఉంటారు. అనేది ప్రజలకి తెలియాలి. అంతెందుకు అల్లు రామలింగయ్యగారి శతజయంతి ఉత్సవాలు అన్ని ఫ్యామిలీలు కలిపి ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాగే సంక్రాంతికి మేము నాన్నగారికి అన్ని పెట్టేసి చిరంజీవి గారి ఇంటికెళతాం, అలాగే దీపావళికి అందరూ కలిసి చిరు గారింట్లోనే అన్నీ సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇప్పటికి ఇదే జరుగుతుంది. ప్రజల కోసం దాన్ని పబ్లిసిటీ చేయలేము అంటూ అరవింద్ మెగా-అల్లు మధ్యన ఉన్న విషయాన్ని చాలా తేలిగ్గా తెగ్గొట్టేసారు.

Arvind Aravind Clarity on Allu-Mega differences:

Once again Allu Aravind clarity on mega family differences

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ