సాంఘీక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక అందులో మంచి కన్నా ఎక్కువగా చెడే వైరల్ అవుతుంది. ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. అయితే మంచి కన్నా ఎక్కువగా ఈ సాంఘీక మద్యమాల వలన చెడు ప్రభావమే ఉంది. ఓ వ్యక్తి నచ్చకపోతే అతన్ని మానసికంగా చంపేసే దాక నెటిజెన్స్ నిద్రపోవడం లేదు. నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్, హాష్ టాగ్స్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈమధ్యన ఈ నెగెటివ్ ప్రభావం బాలీవుడ్ పై ఎక్కువైంది.
అక్కడ స్టార్స్ కిడ్స్, అలాగే కరణ్ జోహార్ లాంటి బడా దర్శకనిర్మాతలని ట్రోల్స్ చేస్తూ వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. టాలీవుడ్ లోను ఇలాంటి కల్చర్ ఉంది. కాబట్టే కొరటాల శివ లాంటి వాళ్ళు సోషల్ మీడియాకి దణ్ణం పెట్టేసారు. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా నుండి ఎప్పుడో తప్పుకున్నారు. అలియా భట్ లాంటి వాళ్ళ సినిమాలొస్తున్నాయి అంటే నెటిజెన్స్ విపరీతంగా హేట్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ప్రొడక్షన్ అయినా, ఆయన హ్యాండ్ ఉంది అని తెలిసినా నెటిజెన్స్ ఊరుకోవడం లేదు. అందుకే కరణ్ జోహార్ కూడా ట్విట్టర్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆయన సోషల్ మీడియా నుండి ఎందుకు తప్పుకున్నారో క్లారిటీ లేకపోయినా.. ఆయనపై సోషల్ మీడియా నుండి వస్తున్న నెగెటివిటి తట్టుకోలేక ఈ డెసిషన్ తీసుకుని ఉంటారంటున్నారు.