మలయాళ లూసిఫర్ స్క్రిప్ట్ ని చాలా మార్పులతో తెలుగులో గాడ్ ఫాదర్ గా తెరకెక్కించారు మోహన్ రాజా. పర్ఫెక్ట్ రీమేక్ గాడ్ ఫాదర్ అంటూ అందరి నుండి ప్రశంశలు అందుకుంది. ఆడియన్స్ ఆహా అన్నారు, క్రిటిక్స్ ఓహో అన్నారు. దసరా సెలవలు, లాంగ్ వీకేండ్ తో మొదటి ఐదు రోజులు కలెక్షన్స్ కళకళలాడాయి. నిర్మాతలు అదే ఊపులో సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హంగామా చేసారు. అయితే మొదటి వీకెండ్ లో కూడా ఓ అన్నంత ఫిగర్స్ ని నమోదు చెయ్యలేకపోయింది గాడ్ ఫాదర్. దానికి కారణం టికెట్ రేట్స్ తగ్గడమే. మొదటి వారంలోనే 50 కోట్ల ఫిగర్ ని సెట్ చేసిన గాడ్ ఫాదర్ వీక్ డే, సోమవారం టెస్ట్ లో టోటల్ గా ఫెయిల్ అయ్యింది.
దసరా సెలవలు ముగియడం, స్కూల్స్, ఆఫీస్ లు తెరచుకోవడంతో సోమవారం గాడ్ ఫాదర్ థియేటర్స్ లో 20 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10 కోట్లు కలెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ నిన్న సోమవారం కేవలం కోటిన్నర వసూలు చేసింది. కనీసం ఏ మూడు నాలుగు కొట్లో వసూలు చేసినా బ్రేక్ ఈవెన్ కి దగ్గరయ్యేది. ఎందుకంటే 90 కోట్ల టార్గెట్ తో గాడ్ ఫాదర్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఇప్పుడు మొదటి వారం పూర్తయ్యేసరికి.. 55 కోట్ల మార్క్ చేరుకుంటే గొప్పే అన్నట్టుగా ఉన్నాయి కలెక్షన్స్. వీక్ డేస్ లో ఇంత వీక్ అయిన గాడ్ ఫాదర్ వలన లాంగ్ రన్ లో బయ్యర్లకి ఎంతో కొంత నష్టాలు అయితే తప్పేలా లేవు.