కొద్ది రోజులుగా సమంత చాలా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత సోషల్ మీడియా కి కూడా దూరంగానే ఉంది. అటు పబ్లిక్ గా కూడా ఫోకస్ అవ్వలేదు. ఏదో స్కిన్ డిసీజ్ తో బాధపడుతుంది. దాని ట్రీట్మెంట్ కోసమే సమంత విదేశాలకు వెళ్ళింది అంటూ ప్రచారం జరిగినా.. సమంత మేనేజర్ స్పందించాడు కానీ, సమంత మాత్రం కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించలేదు. దానితో అసలు సమంత కి ఏమైందో అని ఆందోళన ఆమె ఫాన్స్ లో కనిపించింది.
తాజాగా సమంత మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. అది కూడా ఓ విచిత్రమైన పోస్ట్ తో. తాను వేసుకున్న టీ షర్ట్ మీద ఓ కొటేషన్ తో ఏదో చెప్పాలనుకుంది. ఆ T షర్ట్ మీద నువ్వు ఒంటరిగా ప్రయాణం చెయ్యలేవు అని అర్ధం వచ్చేలా ఉంది. మరి సమంత ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసిందో తెలియదు కానీ.. చాలామంది నెటిజెన్స్ మాత్రం సమంత అది నాగ చైతన్య ని ఉద్దేశించే చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి సమంత మాత్రం ఎప్పటిలాగే ఆక్టివ్ అయ్యింది. ఇకపై సమంత యశోద, శాకుంతలం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేస్తుంది.