Advertisementt

దసరా మిస్ అయ్యింది.. దివాళికైనా వచ్చేనా?

Tue 11th Oct 2022 10:59 AM
nbk107,diwali festival,balakrishna  దసరా మిస్ అయ్యింది.. దివాళికైనా వచ్చేనా?
NBK107 title to be announced for diwali? దసరా మిస్ అయ్యింది.. దివాళికైనా వచ్చేనా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు. అటు సినిమాల షూటింగ్స్ ఇటు ఆహా అన్ స్టాపబుల్ హోస్ట్ అంటూ చాలా బిజీగా మారిపోయారు. NBK107 షూటింగ్ తో పాటుగా ఆహా ప్రోగ్రాం చేస్తున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. NBK107 ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ నందమూరి అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చింది. దానితో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే NBK107 టైటిల్ దసరా స్పెషల్ గా రిలీజ్ చేస్తారని అన్నప్పటికీ.. దసరా ఫెస్టివల్ ని మిస్ చేసారు NBK107 మేకర్స్.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దివాళి రోజున NBK107 టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ పోస్టర్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యనే టర్కీ లో హీరోయిన్ శృతి హాసన్ తో ఓ సాంగ్ తో పాటుగా, యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించిన గోపిచంద్ మలినేని దివాళికి నందమూరి ఫాన్స్ కి టైటిల్ ట్రీట్ తో పాటుగా, సినిమా రిలీజ్ డేట్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నందమూరి ఫాన్స్ కి అలా దసరా మిస్ అయినా.. ఇలా దివాళికి ఫుల్ ట్రీట్ రాబోతుంది.

NBK107 title to be announced for diwali?:

NBK107 title to be announced for diwali festival

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ