Advertisementt

సోలో హిట్ కొట్టేస్తాడా సత్యదేవ్

Mon 10th Oct 2022 08:50 PM
satyadev,godfather,chiranjeevi  సోలో హిట్ కొట్టేస్తాడా సత్యదేవ్
Good Times For Actor SatyaDev సోలో హిట్ కొట్టేస్తాడా సత్యదేవ్
Advertisement
Ads by CJ

రీసెంట్ గా రిలీజ్ అయిన చిరంజీవి గాడ్ ఫాదర్ తో ఎవరికైనా మంచి పేరొచ్చింది అంటే అది సత్యదేవ్ కే. నటుడిగా చాలా మంచి మార్కులు వేయించుకున్నాడు సత్య దేవ్. మొదటి నుంచి విలక్షణ నటుడిగానే ప్రేక్షకుల గుర్తింపు ఉన్న సత్యదేవ్ కి బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు సినిమాలు మంచి ఫలితాలే ఇచ్చినా.. దోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాల్లో తాను భాగమైనా.. తాను సోలోగా చేసి, ఎన్నో హోప్స్ పెట్టుకున్న స్కై లాబ్, గాడ్ సే, గువ్వా గోరింకా తనని బాగా డిస్పాయింట్ చేసాయి. 

అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చిన ఐడెంటిఫికేషన్ అండ్ స్పెషల్ రికగ్నైజేషన్ రాబోయే తన సినిమాలకి ప్లస్ కాబోతుంది. ఎప్పటినుంచో రిలీజ్ కి రెడీ అయ్యి సరైన టైమ్ కోసం వేచి చూస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాకి ఇప్పుడు కాలం కలిసొచ్చింది. గాడ్ ఫాదర్ రిజల్ట్ తో ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆల్రెడీ తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ సపోర్ట్ సత్యదేవ్ కి ఉంది. డెఫనెట్ గా గుర్తుందా శీతాకాలం కి మంచి బజ్ క్రియేట్ అయ్యి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ బావుంటే సత్యదేవ్ సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్టే.. అది కూడా సోలోగా.. 

Good Times For Actor SatyaDev:

SatyaDev Is On Track To Score Big

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ