హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కోసం దర్శకుడు క్రిష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా సిద్దమైపోతున్నారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసి హరి హర వీరమల్లు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లోనే పవన్ కళ్యాణ్ విలువిద్యలు ప్రాక్టీస్ చేసారు. క్రిష్ అలాగే మిగతా టీమ్ తో చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్. ఇక దసరా నవరాత్రులు ముగిసాయి. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కి హాజరవడానికి సిద్ధమయ్యారు.
ఈ నెల 15 నుండి హరి హర వీరమాల్లో కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో మొదలు కాబోతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక నటులు పాల్గొంటారని, పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. దాదాపు ఓ 30 రోజుల ఈ భారీ షెడ్యూల్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా హరి హర వీరమల్లు మేకర్స్ పవన్ కళ్యాణ్ వీరమల్లుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ ని వదలగానే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆ పిక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసారు. గత కొన్ని నెలలుగా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ హరి హర వీరమల్లు సెట్స్ లోకి అడుగుపెడుతుండడంతో పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.