పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్నారు. పెదనాన్న కృష్ణం రాజు గారి మరణం కుదిపేసినా.. ప్రభాస్ పనిలో పడిపోయి కాస్త ఆ బాధనుండి కోలుకుంటున్నారు. వరసగా ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయితే ఆదిపురుష్ నార్మల్ టీజర్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసినా.. 3D టీజర్ మాత్రం ఫాన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ నుండి అనేక ట్రోల్స్ తోనూ, ఎంతో నెగిటివిటీతో సోషల్ మీడియాలో యాంటీ ఫాన్స్ విరుచుకుపడుతున్నారు, #BanAdipurush, #DispointedAdipurush అంటూ హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ యూనిట్ కి కునుకు పట్టకుండా చేస్తున్నారు.
అటు రాజకీయంగానూ ఆదిపురుష్ పై BJP నేతలు విరుచుకుపడుతున్నారు. వీటితోనే సతమతమవుతున్న ఆదిపురుష్ టీం కి, ప్రభాస్ కి తాజాగా మరొక తలనెప్పి మొదలయ్యింది. ప్రభాస్ తోపాటు ఆదిపురుష్ యూనిట్ కి ఢిల్లీ హైకోర్టు ఈరోజు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం దేవుళ్లను తప్పుగా చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ వెయ్యడం పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. శాంతివంతుడైన రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా ఆదిపురుష్ లో చూపించారని, అంతేకాకుండా రావణుడి పాత్ర చాలా భయంకరంగా ఉందని ఆరోపించిన ఆయన.. ఆదిపురుష్ మూవీ విడుదలను నిషేధించేలా స్టే ఇవ్వాల్సిందిగా కోర్టుని కోరడంతో.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీ టీం కి, ప్రభాస్ కి నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.