ప్రభాస్-మారుతి కాంబోలో మూవీ కన్ ఫర్మ్ అవడమే కాదు, ఆ మధ్యన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యింది కూడా. అయితే ఈమూవీ రెగ్యులర్ షూట్ నవంబర్ నుండి మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పారు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ నెలలోనే మారుతి సినిమాకి ఓ వారం డేట్స్ ఇచ్చేసారు అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ లోనే ఓ స్టూడియో లో థియేటర్ సెట్ వేశారు. ఈ వారం రోజుల పాటు ఆ థియేటర్ సెట్ లోనే షూటింగ్ జరగబోతుంది.
పూజా కార్యక్రమాలను ఎంత సైలెంట్ గా చేసారో.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా మీడియా హడావిడి లేకుండా సైలెంట్ గానే పని కానిచ్చెయ్యబోతున్నారు ప్రభాస్ ఇంకా మారుతి లు. అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మాళవిక మోహన్ ఎప్పుడో ఎంపిక కాగా.. మరో హీరోయిన్ గా సీత రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ప్లేస్ లోకి నిధి అగర్వాల్ హీరోయిన్ గా కన్ ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది.