Advertisementt

రాజమౌళి బర్త్ డే: మహేష్ విషెస్

Mon 10th Oct 2022 01:39 PM
mahesh babu,pan india director,ss rajamouli  రాజమౌళి బర్త్ డే: మహేష్ విషెస్
Mahesh birthday wishes to SS Rajamouli రాజమౌళి బర్త్ డే: మహేష్ విషెస్
Advertisement
Ads by CJ

గత కొద్దిరోజులుగా మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారి మరణంతో ఆయన విషాదంలో ఉన్నారు. ఇందిరాదేవిగారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడానికి ముందే ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముగించేశారు. ఇక మధ్యలో తల్లి అస్తికలు హరిద్వార్ లోని గంగ లో కలపడం, గత రెండు రోజులుగా ఆమె దశదిన కర్మలో మహేష్ పాల్గొనడమే కాదు, తనని పరామర్శించడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అన్ని దగ్గరుండి చూసుకున్నారు.

ఇక ప్రస్తుతం SSMB28 రెండో షెడ్యూల్ లో పాల్గొనడానికి మహేష్ రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు చెయ్యబోయే రాజమౌళి ఫిలిం పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కనుంది. ఈ క్రేజీ కాంబో పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ కూడా తన నెక్స్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళికి బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. Wishing you a happy birthday @ssrajamouli sir... Keep inspiring us with your cinematic brilliance! Happiness & success always! అంటూ మహేష్ చెప్పిన బర్త్ డే విషెస్ ని మహేష్ ఫాన్స్ ఫుల్ జోష్ లో వైరల్ చేస్తున్నారు.

Mahesh birthday wishes to SS Rajamouli:

Mahesh Babu birthday wishes to pan india director SS Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ