మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ దసరా సీజన్ లో రిలీజ్ అయ్యింది. ఫెస్టివల్ సీజన్ బాగా కలిసొచ్చింది. లాంగ్ వీకెండ్ కావడం గాడ్ ఫాదర్ కి మరో ప్లస్ అయ్యింది. మౌత్ టాక్ బావుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గాడ్ ఫాదర్ ని లైక్ చేసారు. అంతా బాగానే ఉంది.. కానీ లిమిటెడ్ థియేటర్స్, నార్మల్ టికెట్ ధరల వలన అనుకున్న రెవిన్యుని అయితే గాడ్ ఫాదర్ రాబట్టలేకపోయింది. బట్ సినిమా టాక్ బావుంది. హోల్డ్ స్ట్రాంగ్ గా ఉంది.
ఇకపై అంటే వర్కింగ్ డే సోమవారం నుండి రెవిన్యూ ఎలా ఉంటుంది.. అనే దానిపై అందరిలో ఇంట్రెస్ట్ మొదలయ్యింది. లాంగ్ వీకెండ్, దసరా సెలవలు అన్ని కలిసొచ్చి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన గాడ్ ఫాదర్ ఇక మీదట రాబోయే వీక్ డేస్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందా.. ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుందా.. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.