బిగ్ బాస్ 6 ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఐదు వారాలకు గాను ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. షాని, అభినయ, నేహా చౌదరి, ఆరోహి, నిన్న చంటి బిగ్ బాస్ ని వీడారు. అయితే ఇందులో నేహా చౌదరి, చంటి ఎలిమినేషన్స్ చాలామందికి రుచించడం లేదు. నేహా చౌదరి మంచి గేమ్ ఆడుతుంది. చంటి గేమ్ ఆడకపోయినా ఎంటర్టైనర్. అలాంటి వారిని హౌస్ నుండి పంపేసి రాజ్, అర్జున్ కళ్యాణ్, వాసంతి, కీర్తి లాంటి వాళ్ళని బిగ్ బాస్ లో ఉంచడంపై చాలామంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐదు వారాల సంగతి అలా ఉంటే.. ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసినట్టుగా బిగ్ బాస్ లీకులు బయటికి వచ్చేసాయి. ఈ వారం నామినేట్ చేసే కంటెస్టెంట్ మొహానికి తెలుపు రంగు క్రీమును పూసి నామినేట్ చెయ్యాలి.
అందులో భాగంగా కెప్టెన్ రేవంత్ తనకి సామెతల బోర్డు వేసిన వారిని అంటే సుదీప, బాలాదిత్య లని క్రీమ్ రాసి నామినేట్ చేస్తూ.. గొడవపడ్డాడు. నువ్ అతి మంచి తనంతో సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ బాలాదిత్యతో రేవంత్ గొడవపడి నామినేట్ చేసాడు. అలాగే వేరేవారు కూడా ఈ నామినేషన్స్ విషయంలో కాస్త గట్టిగానే అరుచుకున్నారు. అలా ఈ వారం మళ్ళీ ఎనిమిదిమంది నామినేషన్స్ లోకి వచ్చినట్టుగా లీకులు చెబుతున్నాయి. అందులో ఇనాయా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, సుదీప, కీర్తి, శ్రీహాన్, గీతూ లు నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి కానీ ప్రసారం కాదు, కానీ లీకులు మాత్రం ఈవారం ఎవరు నామినేట్ అయ్యారో బయట పెట్టేశాయి.