టైటిలే స్వాతి ముత్యానికి శాపమా..
స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత ఓ ప్రేక్షకుడి ఆవేదన
కొన్ని సినిమాలకు టైటిల్సే శాపాలవుతాయ్..
క్లాసిక్స్ గా నిలిచిపోయిన సినిమాల పేర్లయితే అసలు పెట్టకూడదు..
ఆ క్లాసిక్స్ పై పెంచుకున్న అభిమానంవల్లో.. లేక ఎన్నో ఏళ్లుగా వింటున్న పాత టైటిల్ అనే భావనవల్లో సినిమా బాగుందని తెలిసినా జనాలు థియేటర్లకు మాత్రం వెళ్లరు..
ప్రస్తుతం స్వాతిముత్యం సినిమా పరిస్థితి ఇదే..
సినిమా అయితే చాలా బావుంది..
రెండుగంటల పదిహేను నిమిషాలు ఆహ్లాదంగా.. సరదాగా గడిచిపోయింది..
సగటు ప్రేక్షకుడిగా చెప్పాల్సొస్తే దసరాకు విడుదలైన మూడింటిలో ది బెస్ట్ మూవీ స్వాతిముత్యం..
ఇది కేవలం నా అభిప్రాయం..🙏
ఇప్పుడే చూసొస్తున్నా.. ఆదివారం అవ్వడం వల్లేమో ఐమాక్స్ లో హాలు సగానికి పైగానే నిండింది..
మరి రేపట్నుంచి పరిస్థితేంటో..😥
రేపు OTTలో చూసేసి బాగుంది అంటే ఎవరికి ఉపయోగం?... తీసినోళ్లకీ చూసినోళ్లకీ ఇద్దరికీ అసంతృప్తేగా..!?
అందుకే... సినిమాను నిజంగా ప్రేమించేవారైతే తప్పకుండా థియేటర్ కెళ్లి స్వాతిముత్యం చూడండి.. కుదిరితే ఇంట్లోవాళ్లను కూడా తీసుకెళ్లి చూపించండి.. మంచి సినిమా.. ఎక్స్ లెంట్ ఎంటర్టైనర్..
ఒట్టేసి చెబుతున్నా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు..👌😀 చూడండి ప్లీజ్..🙏