Advertisementt

మనోజ్ పెళ్లిపై మంచు లక్ష్మి కామెంట్స్

Sun 09th Oct 2022 07:17 PM
manchu lakshmi,manchu manopj,bhuma mounika reddy  మనోజ్ పెళ్లిపై మంచు లక్ష్మి కామెంట్స్
Manchu Lakshmi comments on Manoj second marriage మనోజ్ పెళ్లిపై మంచు లక్ష్మి కామెంట్స్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ రెండో పెళ్లి పై ఇంతవరకు మంచు ఫ్యామిలీ స్పందించింది లేదు. మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని రెండో వివాహం చేసుకోబోతున్నట్టుగా మీడియా కన్ ఫర్మ్ చేసినా మనోజ్ ఇంకా ఈ విషయమై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. వినాయక చవితి ఉత్సవాల్లోనే మంచు మనోజ్ రెండో పెళ్లి మేటర్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ పెళ్ళికి పెద్ద చంద్రబాబు, అందుకే మోహన్ బాబు చంద్రబాబు ని మీట్ అయ్యారంటూ ఏవేవో న్యూస్ లు వినిపించినా.. మనోజ్ సెకండ్ మ్యారేజ్ విషయమై మంచు ఫ్యామిలీ సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తుంది. 

అయితే తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ రెండో పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మ‌నోజ్ పెళ్లి గురించి అడిగిన యాంకర్ తో ఎవడి దూల వాడిది, ఎవ‌రి బ‌తుకు వాళ్ల‌ని బ‌త‌క‌నివ్వండి అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రోజుల్లో నిస్వార్థ‌మైన‌, నిజాయితీతో కూడిన ప్రేమ‌ను పొంద‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెప్పింది. ఇప్పుడు మ‌నోజ్ అలాంటి ప్రేమ‌ను పొందుతున్నందుకు సంతోషిస్తున్నాన‌ని చెప్పడం చూస్తే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి తో అలాంటి ప్రేమ పొందలేదనా మంచు లక్ష్మి ఉద్దేశ్యం అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ప్రేమ పొందనందుకే మనోజ్ ప్రణతితో విడిపోయాడా అంటున్నారు.

Manchu Lakshmi comments on Manoj second marriage:

Manchu Lakshmi Shocking comments on Manchu Manoj second marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ