ప్రముఖ నటుడు సముద్రఖని కోలీవుడ్ లో మంచి దర్శకుడు కూడా. తెలుగులో మాస్ విలన్ గా ఆకట్టుకుంటున్న సముద్రఖని ఇక్కడ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదియం సీతయం ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. అదలా ఉంటే తాజాగా సముద్రఖని ఆఫీస్ లో ఓ విచిత్రమైన దొంగతనం జరగడం కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
చెన్నై లోని మధురైవాయిల్ లో సముద్ర ఖని ఆఫీస్ లోకి ఓ మహిళా దొంగ ప్రవేశించి అక్కడ కారుపై ఆరవేసిన రైన్ కోట్స్ ని దొంగతనం చెయ్యడమే కాకుండా ఆ రైన్ కోటుని ధరించి కారుపై కాసేపు నిద్రపోయి.. మెల్లగా ఆ రైన్ కోట్స్ పట్టుకుని వెళ్లిపోవడం కాస్త విచిత్రంగానే అనిపించింది. ఈమేరకు సముద్ర ఖని మేనేజర్ కార్తీక్ దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యగా.. సముద్ర ఖని ఆఫీస్ లో రైన్ కోట్స్ పోవడంపై నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.