Advertisementt

నాగ చైతన్య చిత్ర బృందంపై దాడి

Sun 09th Oct 2022 04:49 PM
naga chaitanya,venkat prabhu,karnataka melukote temple  నాగ చైతన్య చిత్ర బృందంపై దాడి
Naga Chaitanya And Venkat Prabhu Movie Team Done A Mistake నాగ చైతన్య చిత్ర బృందంపై దాడి
Advertisement
Ads by CJ

లాల్ సింగ్ చద్దా తీవ్రంగా నిరాశ పరచడంతో నాగ చైతన్య కాస్త డిస్పాయింట్ అయినప్పటికీ.. వెంటనే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి NC22 ని బైలింగువల్ గా మొదలు పెట్టేసాడు. ఈ సినిమాలో చైతు కి జోడిగా మరోసారి కృతి శెట్టి జోడి కడుతుంది. అయితే నాగ చైతన్య కి పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామి కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మేలుకోతే గుడి ప్రాంతంలో జరుగుతోంది. ఆ గుడికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ చారిత్రక దేవాలయంలో నాగ చైతన్య పై పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమని మేలుకోతే ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ పరిసర ప్రాంతంలో ఓ బార్ కు సంబంధించిన సెట్ వేశారు.

పవిత్ర స్థలం దగ్గర బార్ సెట్ వెయ్యడంతో అక్కడి ప్రజలు NC22 యూనిట్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పురావస్తు శాఖ స్మారక చిహ్నం సమీపంలో బార్ సెట్ నిర్మాణంపై మాండ్యాలోని పాండవపూర్ తాలుకా మేలుకోతే ప్రజలు అభ్యంతరం వ్యక్తం చెయ్యడమే కాదు, అక్కడ బార్ సెట్ వేసి వైష్ణవ క్షేత్రాన్ని అవమానించారని, నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన మనోభావాలను దెబ్బ తీస్తూ చిత్రీకరణ చేసారని, తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేసి యూనిట్ మొత్తం వెళ్లిపోవాలని స్థానికులు ఆదేశించారట.

Naga Chaitanya And Venkat Prabhu Movie Team Done A Mistake:

NC22 Movie Team Done A Mistake In Karnataka Melukote Temple And Get Attacked By Karnataka People

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ